దా. అక్కినేని నాగేశ్వరరావు కి నివాళులర్పించడం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, దానికి సంబందించిన అందరూ రేపు బంద్ కి పిలుపునిచ్చారు. మా అసోసియేషన్ తరపున మురళీ మోహన్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసారు.
సినిమా షూటింగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ అన్నిటినీ రేపు నిలిపేయనున్నారు. అలాగే కొన్ని ఏరియాల్లో సినిమాలను ప్రదర్శించడం కూడా నిలిపివేస్తున్నారు. అలాగే ఏఎన్ఆర్ అంతిమ యాత్రకు సంబందించిన ఏర్పాట్లు జరగనున్నాయి. అలాగే ఈ అంతిమ యాత్రకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తరలి రానుంది.