బాక్స్ ఆఫీస్ వద్ద బిజీ వీకెండ్

బాక్స్ ఆఫీస్ వద్ద బిజీ వీకెండ్

Published on Dec 24, 2012 11:17 PM IST

Yamudikimogudu,genius,koant
ఈ ఏడాది వారాంతం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి బాగా కనిపిస్తుంది. ఈ వారంతం నాలుగు చిత్రాలు విడుదల అవుతుండగా నాలుగింటినీ భారీగా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. డిసెంబర్ 27న అల్లరి నరేష్ మరియు రిచా పనాయ్ ప్రధాన పాత్రలలో “యముడికి మొగుడు” చిత్రం రానుంది.”సుడిగాడు” చిత్రం విజయం సాదించిన తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారీగా అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 28న మూడు చిత్రాలు విడుదల కానున్నాయి. విశాల్, త్రిష ప్రధాన పాత్రలలో “వెంటాడు వేటాడు”, ఓంకార్ “జీనియస్” మరియు “కో అంటే కోటి” చిత్రం విడుదల కానుంది. హవిష్ ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో రానున్న “జీనియస్” చిత్రాన్ని 300 స్క్రీన్ లలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు ఈ చిత్రం మీద ఇప్పటికే నిర్మాత 12 కోట్లు ఖర్చు చేశారు. ఈ పోటీలో ఏ చిత్రం విజేతగా నిలబడుతుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు