సిసిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు వారియర్స్

సిసిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు వారియర్స్

Published on Feb 5, 2012 3:27 PM IST


సెలెబ్రిటి క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వైజాగ్లో చెన్నై రైనోస్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన చెన్నై రైనోస్ 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. విష్ణు 54 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తెలుగు వారియర్స్ జట్టులో అధర్ష్ మరియు చరణ్ ఇద్దరు కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేసి వారియర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అధర్ష్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ విజయంతో తెలుగు వారియర్స్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. వారియర్స్ ఫిబ్రవరి 11న చెన్నై రైనోస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు.

తాజా వార్తలు