ధనుష్ నటిస్తున్న తమిళ చిత్రం ‘3’ తెలుగు వెర్షన్ కి సంభందించిన డబ్బింగ్ ఈ రోజే ప్రారంభమైంది. ధనుష్ మరియు శృతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు మరియు ధనుష్ భార్య అయిన సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కొలవేరి’ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ పాట భారీ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిరుద్ శ్రీకాంత్ సంగీతం అందించిన తెలుగు పాటలు కూడా త్వరలో విఇడుదల చేయనున్నారు.