విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్

విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్

Published on Oct 26, 2025 4:00 PM IST

తమిళ విలక్షణ హీరోస్ లో ఒకరైన చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ కొన్నాళ్ల కితమే వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలు కాకుండా తన లేటెస్ట్ చిత్రం “బైసన్”ని మాత్రమే తన తొలి సినిమాగా తను భావించాడు. అయితే ఈ సినిమా వారం గ్యాప్ తో తెలుగులో విడుదల అయ్యింది.

ఈ సినిమా ప్రమోషన్ తోనే తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరైన ధృవ్ విక్రమ్ కి ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్ అందించారు అనే చెప్పాలి. తన బైసన్ సినిమా తెలుగు వెర్షన్ లో మొదటి రోజు కంటే రెండో రోజు బెటర్ గా పెర్ఫామ్ చేయడమే అందుకు నిదర్శనం అని చెప్పాలి.

ఇలా ధృవ్ విక్రమ్ కూడా మంచి ఆదరణ తెలుగు ప్రేక్షకుల నుంచి అందుకోగా దీనిని నిలుపుకుంటాడో లేదో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ లో నటించగా మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు