విలక్షణ దర్శకుడు తేజ డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నీకు నాకు డాష్ డాష్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి గాను ‘ఎ’ సర్టిఫికేట్ జారీ చేసారు. వాయిలెన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటం, డైలాగులు కూడా విపరీత ధోరణిలో ఉండటంతో సెన్సార్ సభ్యలు ఎ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో అందరూ కొత్త తారలే. గతంలో సొంత ఊరు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తీర్ధ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె నటన సినిమాకి హైలెట్ అనీ, మొదటి సినిమాతోనే అవార్డు సొంతం చేసుకున్న ఆమె నటనకు ఈ సినిమాకు కూడా అవార్డు వస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు.