డైరెక్టర్ తేజ తన నెక్స్ట్ మూవీలోని నటీనటుల కోసం ఆన్లైన్ ఆడిషన్స్ జరుపుతున్నారు. గత ఏడాది సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా సీత అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నారు. గతంలో ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. రాక్షసరాజు రావణాసురుడు, అలివేలుమంగ వెంకట రమణ అనే ఈ టైటిల్స్ లో ఓ మూవీ తెరకెక్కించే పనిలో ఆయన ఉన్నారు. ఇక ఈ చిత్రంలో హీరో గోపిచంద్ అని తెలుస్తుండగా అందులోని క్యాస్టింగ్ కాల్ చూస్తే హీరో ఫ్యామిలీ పెద్దదే అనిపిస్తుంది.
ఆయన హీరో తల్లి, అన్న, చెల్లి, వదిన,బావ మరియు ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ ల కోసం ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. దీనితో తేజ నెక్స్ట్ మూవీలో హీరోకి పెద్ద ఫ్యామిలీనే సెట్ చేశాడు అనిపిస్తుంది. మరి ఈ మూవీ కథా, కథనాలు ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్సు. కొద్దిరోజులలో ఆడిషన్స్ పూర్తి చేయనున్న తేజా, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు .