యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. యూనివర్సల్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసిన ఈ లార్జర్ ధన్ లైఫ్ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ అయితే ఇప్పుడు వచ్చేసింది. మరి ఈ సినిమా ట్రైలర్ మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి.
ముఖ్యమైన ఓ 9 శక్తివంతమైన గ్రంథాలు వాటి కోసం వెతికే విలన్ వాటిని అతడికి చిక్కకుండా చేసేందుకు పోరాటం చేసే హీరో ఈ మధ్యలో సాలిడ్ యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఊహించని లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. సెపరేట్ ప్రపంచాన్ని చూపిస్తున్న మేకర్స్ ఇందులో భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఇంకా యాక్షన్ పార్ట్ లతో ఇంప్రెస్ చేశారు.
ముఖ్యంగా తేజ సజ్జ, మంచు మనోజ్ లు తమ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ లని ఇందులో చూపిస్తున్నారు. ఒక సూపర్ హీరో తరహా ఎలిమెంట్స్ అందులో డివోషనల్ టచ్ తో ట్రైలర్ మాత్రం థియేటర్స్ లో పాన్ ఇండియా ఆడియెన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజన్ ని మెచ్చుకొని తీరాల్సిందే.
ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుని అందుకు తగ్గట్టుగా అత్యున్నత ప్రమాణాలతో డిజైన్ చేసి చూపించడం అనేది తన కమిట్మెంట్ ని చూపిస్తుంది. ఇక హను మం సంగీత దర్శకుడు గౌర హరి స్కోర్ కూడా ఈ ట్రైలర్ లో మరింత ఇంపాక్ట్ కలిగిస్తుంది. ఇక లాస్ట్ లో శ్రీరామునిపై సన్నివేశాలు వర్కౌట్ అయితే మాత్రం వసూళ్ల వర్షం కురుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఎక్కడా తగ్గకుండా నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి