మాంచి క్యాచీగా ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ అదిరింది!

మాంచి క్యాచీగా ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ అదిరింది!

Published on Jul 26, 2025 10:21 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “మిరాయ్”., తేజ సజ్జ హను మాన్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్ళీ అదే తరహాలో ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ “వైబ్ ఉంది” లిరికల్ వీడియో సాంగ్ ని లాంచ్ చేశారు.

మరి ఈ సాంగ్ మాత్రం విన్న వెంటనే నిజంగానే మంచి వైబ్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఇచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ మంచి క్యాచీగా ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పాల్సిందే. ముఖ్యంగా మధ్యలో వైబ్ ఉందిలే బేబీ అనే బీట్ మాత్రం అర్మాన్ మాలిక్ వాయిస్ లో వింటేజ్ స్టైల్ సాంగ్ ని తలపించింది.

అలాగే కృష్ణకాంత్ ఇచ్చిన సాహిత్యం కూడా చాలా బాగుంది. ఇక సాంగ్ లో తేజ సజ్జ చాలా స్టైలిష్ గా కనిపించాడు. తన డాన్స్ మూమెంట్స్ లో మంచి గ్రేస్ తో ఆకట్టుకున్నాడు. ఇక తనతో పాటుగా రితిక మంచి గ్లామర్ తో ఆకట్టుకుంది. అలాగే గెటప్ శ్రీను కూడా ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ఓవరాల్ గా మాత్రం మిరాయ్ నుంచి ఈ ఫస్ట్ సింగిల్ అదిరింది. వినెయ్యండి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు