టీజర్ టాక్ : ఫ్యాన్స్ కి పండుగే.. టీజర్ తో అదరగొట్టిన ‘ది రాజా సాబ్’ !

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమ్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం అంటూ సాగిన ఈ టీజర్ వండర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పవర్‌ ఫుల్‌గా కనిపించారు. హీరోయిన్స్ తో లవ్ మూమెంట్స్ తో పాటు సంజయ్ దత్ రోల్ కూడా అదిరిపోయింది. ఇక విజువల్స్ తో పాటు ప్రభాస్ లుక్ అండ్ ఎలివేషన్ షాట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్స్ ను రివీల్ చేసిన షాట్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్ లో మ్యూజిక్ అండ్ టేకింగ్ మరియు గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ టీజర్‌ చాలా బాగా ఆకట్టుకుంటోంది.

కాగా టీజర్ ను బట్టి, ఈ సినిమాలోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని, ముఖ్యంగా ఈ సినిమా లో వచ్చే యాక్షన్ విజువల్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని అర్ధం అవుతుంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడు. పైగా ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి హిట్ కొడితే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే. అన్నట్టు ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version