యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రాగ్ మయూర్ రీసెంట్ గా మిత్రమండలి సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాగ్ మయూర్ డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కాంబినేషన్ లో చేస్తున్న సినిమానే “అనుమాన పక్షి”. మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.
అయితే ఈ సినిమా లేటెస్ట్ గా ఒక కూల్ షెడ్యూల్ ని ఎలాంటి అనుమానం లేకుండా కాశ్మీర్ లో పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ రివీల్ చేశారు. షెడ్యూల్ తర్వాత మొత్తం టీం కలిసి ఆ షెడ్యూల్ ని విజయవంతంగా కంప్లీట్ చేసినట్టు స్పెషల్ పిక్ తో పోస్ట్ చేయడం జరిగింది. ఇక అన్ని పనులు ముగించుకొని అతి త్వరలోనే సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ, ప్రిన్స్ తదితరులు నటిస్తుండగా చిలక ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
