యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యుక్తి తరేజా హీరోయిన్ గా దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమే కే ర్యాంప్. ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం నుంచి మరో హిట్ గా నిలిచి అదరగొట్టింది. ఇక ఈ సినిమా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఈ నవంబర్ 15 నుంచి సినిమా స్ట్రీమ్ అయ్యేందుకు లాక్ అయ్యింది. సో ఆరోజు నుంచి సినిమాను చూడవచ్చు. ఇక ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండా నిర్మాణం వహించారు.
