‘పెద్ది’ సాంగ్ రేర్ ఫీట్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమానే “పెద్ది”. భారీ హైప్ ని సెటప్ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ చార్ట్ బస్టర్ అయ్యి కూర్చుంది.

ఆల్రెడీ తెలుగు వెర్షన్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓ రేర్ ఫీట్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ వీడియో అండ్ ఫస్ట్ సాంగ్ 24 గంటలూ పూర్తి కాకముందే ప్రతీ భాషలో 1 మిలియన్ కి పైగా వ్యూస్ దాటిన సాంగ్ గా నిలిచింది. అంతే కాకుండా 24 గంటల్లో 46 మిలియన్ కి పైగా వ్యూస్ అందుకొని సౌత్ ఇండియా దగ్గర రికార్డు సెట్ చేయగా సౌత్ ఇండియా నుంచి ఉన్న ఆల్ టైం హైయెస్ట్ ని కేవలం 10 గంటల్లోనే క్రాస్ చేసేసింది.

ఇలా మొత్తానికి పెద్ది మొదటి పాటే క్రేజీ రికార్డ్స్ తో మొదలైంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజునే సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version