ఓటిటి సమీక్ష: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ – తెలుగు ఒరిజినల్ చిత్రం ఆహా లో

Raj-Tarun's-Chiranjeeva

విడుదల తేదీ :

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

ప్రసార వేదిక:  ఆహా
నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు, రాజా రవీంద్ర, బలగం సంజయ్ కృష్ణ తదితరులు
దర్శకత్వం: అభినయ కృష్ణ
నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసిని రాహుల్
సంగీతం: అచ్చు రాజమణి

సినిమాటోగ్రాఫర్: రాకేష్ ఎస్ నారాయణ్
ఎడిటర్: జునైద్ సిద్ధిక్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

sssssssయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా అదిరే అభి మొదటిసారి దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రమే “చిరంజీవ”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా తో కోలాబ్ అయ్యి తెరకెక్కించి నేరుగా ఓటిటిలో రిలీజ్ కి తీసుకొచ్చిన సినిమా నేటి నుంచి ఆహా లో ప్రసారం అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక అంబులెన్స్ డ్రైవర్ అయినటువంటి మిడిల్ క్లాస్ కుర్రాడు శివ (రాజ్ తరుణ్) ఒక ఊహించని ఘటన ద్వారా తనకి ఇతరుల జీవిత కాలం ఎంత ఉంది అనేది తెలుసుకునే అతీత శక్తి దొరుకుతుంది. అయితే దీనిని వాడుకొని తాను డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు కానీ తన జీవితంలో జరిగిన ఓ విషాద ఘటనతో ఆ శక్తిని తాను మరో రకంగా వినియోగించాలని భావిస్తాడు. మరి తనకి ఈ శక్తి ఎలా వచ్చింది? తన జీవితంలో జరిగిన ఆ విషాదం ఏంటి? దీని వల్ల చివరికి అతనికి నష్టం కలిగిందా లాభం కలిగిందా? అనేవి తెలియాలి అంటే ఆహా లో ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

తన రోల్ లో రాజ్ తరుణ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. ఇలాంటి సింపుల్ కుర్రాడి హ్యూమర్ రోల్స్ లో తాను బాగుంటాడు. అలానే ఈ సినిమాలో కూడా మంచి రోల్ ని ఓ పక్కింటి కుర్రాడిలా సింపుల్ గా చేసేసాడు. తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాలో ఇంప్రెస్ చేసాడు.

అలాగే నటుడు రాజా రవీంద్ర ఎమ్మెల్యే రాజయ్యగా కావాల్సినంత సీరియస్ నెస్ చూపించారు. అలాగే బలగం సంజయ్, రచ్చ రవి మంచి సపోర్టింగ్ రోల్ లో కనిపించి మెప్పిస్తాడు. ఇలా ముఖ్య నటులు మాత్రం సినిమాలో తమదైన నటన కనబరిచి ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

తెలుగు సినిమా దగ్గర ఫాంటసీ లైన్ తో కూడిన సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అయితే ఇపుడు ట్రెండీ సమయంలో కూడా ఈ తరహా సినిమాలు ప్రత్యేక అటెన్షన్ నే అందుకుంటాయి. కానీ ఈ సినిమాలో లైన్ మాత్రం కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు కానీ పాత సినిమాలు నుంచీ చూసినవారికి అయితే కొంచెం రొటీన్ గానే అనిపిస్తుంది.

ఈ తరహా లైన్ తో ఆల్రడీ ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి చూసిన సినిమాలు, శివాజీ యమలోకం టు భూలోకం సినిమా కూడా గుర్తు రాక మానదు. అలాగే ఈ సినిమా కథనంలో సరైన స్థిరత్వం కూడా లోపించింది. కామెడీ ప్లేస్ మెంట్, ఎమోషనల్ పార్ట్ వంటి వాటిని ఇంకా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.

అలాగే చాలా వరకు నటీనటుల పాత్రల డెవలప్మెంట్ కూడా చాలా సింపుల్ గా పెద్దగా ప్రభావం చూపని విధంగానే కనిపిస్తాయి. శివ తల్లి రోల్ లో ఎమోషనల్ డెప్త్ మిస్ అయ్యింది. అలానే హీరోయిన్ కుషిత కళ్లపు రోల్ నామమాత్రంగా అనిపిస్తుంది. మెయిన్ గా కథనం ఇంకా గ్రిప్పింగ్ గా కొత్తగా ఏమన్నా ట్రై చేయాల్సింది. మూమెంట్స్ అన్నీ చాలా రొటీన్ గా సాగడం మూలాన ఈ సినిమా అంత ఎంగేజింగ్ గా అనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవర్ గా ఉంది. హీరోని ఎలివేట్ చేసే స్కోర్ బాగా రిపీటెడ్ గా బాగా బిగ్గరగా ఉండి విసిగించేలా ఉంది. ఎడిటింగ్ కూడా ఇంకా టైట్ గా సెట్ చేయాల్సింది. కెమెరా వర్క్ బానే ఉంది.

ఇక దర్శకుడు అభినయ కృష్ణ విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న లైన్ బానే ఉంది కానీ ఈ కథకి తగ్గ ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీతో కూడుకున్న కథనం తాను డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. వీటిపై తాను ఇంకా గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే ఈ సినిమా తాలూకా అవుట్ పుట్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘చిరంజీవ’ సినిమాలో రాజ్ తరుణ్ తనదైన నటన కనబరిచాడు. అలాగే అదిరే అభి ఎంచుకున్న లైన్ కూడా ప్రస్తుత జెనరేషన్ కి ఇంట్రెస్టింగ్ ఫాంటసీ సబ్జెక్టుగా అనిపిస్తుంది, అలానే రాజ్ తరుణ్ కూడా మంచి ఫ్లోలో కనిపిస్తాడు. కాకపోతే దీనికి తగ్గ ఆసక్తికర కథనం కూడా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. వీటితో ఈ సినిమా బదులు వేరే ఆప్షన్ చూసుకుంటే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version