మా యముడు విభిన్నం అంటున్న “నేను చాల వరస్ట్” టీం

మా యముడు విభిన్నం అంటున్న “నేను చాల వరస్ట్” టీం

Published on Dec 3, 2012 10:00 PM IST

యమధర్మరాజుకి మన పరిశ్రమకి విడదీయలేని బంధమే ఉంది ఎన్టీఆర్ “యమగోల” నుండి రవితేజ “దరువు” వరకు పరిశ్రమలో యముడికి ప్రత్యేక స్థానమే కలిపించింది. తాజాగా ఇందులోకి మరో చిత్రం రానుంది తారకరత్న యముడిగా చేస్తున్న “నేను చాలా వరస్ట్” అనే చిత్రం కూడా ఇలా యముడికి సంబందించినదే, కాని ఇప్పటి వరకు మీరు చూసిన యముడి పాత్రలకు ఇందులోని యముడి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. హైదరాబాద్లో తారకరత్న మరియు కొంతమంది ఆర్టిస్టుల మీద ఒక పాట మరియు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో భానుప్రియ, మురళీమోహన్, జయప్రకాష్‌రెడ్డి, తెలంగాణ శకుంతల, రాజీవ్‌కనకాల తదితరులు నటిస్తున్నారు. పార్థ సారధి సంగీతం అందిస్తుండగా ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు