ఆ సినిమాలో అనుష్క ప్లేసులో తాప్సీ నటించనుందా?

ఆ సినిమాలో అనుష్క ప్లేసులో తాప్సీ నటించనుందా?

Published on Jun 28, 2012 12:05 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ చిత్రం 1991లో తెలుగు చలన చిత్ర రంగంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారని మేము ఇదివరకే తెలియజేశాము. మొదట ఈ చిత్రానికి అనుష్కని కథానాయికగా తీసుకోవాలని చర్చలు జరిపారు, కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని డిల్లీ అందాల భామ తాప్సీ దక్కించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అనుష్క బిజీగా ఉన్నందువల్ల తన కాల్షీట్లు కుదరలేదని అందువల్లే ఈ చిత్రం నుండి తప్పుకున్నరనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం ఆగష్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొండా కృష్ణంరాజు సమర్పణలో వినోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు