తెలుగులో ఏ సినిమాకి సంతకం చేయని తాప్సీ

తెలుగులో ఏ సినిమాకి సంతకం చేయని తాప్సీ

Published on Mar 12, 2014 3:35 PM IST

Tapsee-2

ప్రస్తుతం తాప్సీ తెలుగులో ఏ సినిమాకి సంతకం చేయలేదు. ఆమె గత కొద్ది నెలలుగా ముంబై లో వుంటున్నారు. దానితో ఆమెపై రోమర్స్ మొదలయ్యాయి. తాప్సీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని అంటున్నారు. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఈ మధ్య ఆమె టైమ్స్ అఫ్ ఇండియా తో మాట్లాడినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటురన్న విషయాన్ని ఆమె ఖండించారు. ఈ విషయంపై మాట్లాడుతూ ‘ నేను నటించిన ‘సాహసం’, ‘ఆరంభం’ సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాదించాయి. అలాంటి సక్సెస్ లను వదులుకోవడం నాకు ఇష్టం లేదు’. అని చెప్పింది. ఈ సంవత్సరం తాప్సీ లారెన్స్ ‘ముని 3 సినిమాలో నటిస్తోంది. అలాగే ఆమె బాలీవుడ్ సినిమాలో, తమిళ సినిమాల్లో కూడా నటించింది.

తాజా వార్తలు