మహేష్ బాబు – పూరి – గణేష్ కాంబినేషన్లో టపోరి?

మహేష్ బాబు – పూరి – గణేష్ కాంబినేషన్లో టపోరి?

Published on Jan 17, 2013 4:40 PM IST

mahesh-puriii
ఫిల్మ్ చాంబర్లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘టపోరి’ అనే సినిమా టైటిల్ రిజిస్టర్ అయ్యిందని కొంత సమయం ముందే తెలిపాము. ఈ విషయంపై కాస్త లోతుగా దర్యాప్తు చేయగా, మా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న సినిమాకి ఈ టైటిల్ ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించే అవకాశం ఉంది. కానీ ఈ సినిమా గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమాకి సంబందించిన చర్చలు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల, క్రిష్, పూరి జగన్నాధ్ డైరెక్షన్లో సినిమాలు చేయనున్నారు. ఈ సినిమా పై అధికారికంగా అంగీకారం మాకు తెలియగానే మరిన్ని విశేషాలు మీకందిస్తాము.

తాజా వార్తలు