ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Aug 18, 2025 11:43 AM IST

tanikella-bharani

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగస్టు 17, 2025
స్ట్రీమింగ్‌ వేదిక :  ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : తనికెళ్ళ భరణి, మహాదేవ్, శరణ్య శర్మ
నిర్మాత : రాఘవేంద్రరావు బి ఏ
సంగీతం : శాండీ అద్దంకి
ఛాయాగ్రహణం : రాఘవేంద్ర వట్టెల
కూర్పు : రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న కథా సుధా వీక్లీ సిరీస్ నుంచి వస్తున్న లేటెస్ట్ లఘు చిత్రమే ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

2004 సమయంలో అప్పుడప్పుడే సెల్ ఫోన్ లు వాడటం మొదలవుతున్న సమయంలో ఒక చిన్న కుగ్రామంలో సైకిల్ పంచర్ షాప్ లో పని చేసే రాజు (మహాదేవ్) అదే ఊరికి చెందిన అమ్మాయి మల్లి (శరణ్య శర్మ) ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ అదే ఊరికి చెందిన దొర (తనికెళ్ళ భరణి) తనకి వచ్చిన కొత్త సెల్ ఫోన్ తో అందరి ఫోటోలు, వీడియోలు రికార్డు చేస్తూ తన శారీరిక ఆనందం కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇలా రాజు, మల్లిలపై కూడా ఓ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి ఓ కోరిక కోరడం జరుగుతుంది. మరి ఆ కోరిక ఏంటి? దానికి రాజు, మల్లి ఎలాంటి సమాధానం ఇచ్చారు అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

నిజానికి ఈ ఎపిసోడ్ లో థీమ్ చాలా డీసెంట్ గా ముఖ్యంగా 90స్ కిడ్స్ లాంటి వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఈ కథా సుధలో గత ఎపిసోడ్స్ కి ఇది కొంచెం భిన్నమైన టచ్ లో కూడా ఎలాంటి కదిలించే ఎమోషన్స్ లా కాకుండా మంచి ఫన్ తో ప్లాన్ చేశారు ఇది కొత్తగా అనిపిస్తుంది.

ఇక సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి సాలిడ్ పెర్ఫామెన్స్ చేశారు. చాలా రోజులు తర్వాత ఇలాంటి కామెడీ రోల్ ని చేయడం అందులో నెగిటివ్ షేడ్ తన నుంచి ఇలాంటి పాత్రలు బాగా మిస్ అవుతున్న వారికి మంచి ట్రీట్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా మంచి ఈజ్ తో తన నటన కనిపిస్తుంది.

అలాగే నటుడు మహాదేవ్ బాగా చేసాడు. శరణ్య శర్మ ఇదే కథ సుధలో చాల డిఫరెంట్ గా కనిపించింది. నగుమోము కనలేని ఎపిసోడ్ లో ఎంత ట్రెండీగా ఉందో ఇందులో అంతే ట్రెడిషినల్ గా పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపించింది. ఇంకా తనికెళ్ళ భరణిపై ఓ కామెడీ సీన్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

జస్ట్ క్యాజువల్ గా ఈ ఎపిసోడ్ ని చూసేవారికి ఏమో కానీ ఈ సిరీస్ ని ఫాలో అవుతున్న వారికి మాత్రం ఈ ఎపిసోడ్ డెఫినెట్ గా నచ్చకపోవడానికే ఆస్కారం ఉంది. ఎందుకంటే నగుమోము కనలేని ఎపిసోడ్ లో తండ్రీ కూతుళ్లుగా ఎంతో ఆప్యాయంగా కనిపించిన ఇద్దరు నటులు ఈ ఎపిసోడ్ లో పూర్తిగా భిన్నంగా ప్రెజెంట్ చేయడం జరిగింది.

ఖచ్చితంగా ఇక్కడ ఇంప్రెషన్ దెబ్బ తింటుంది. ఎంత కాదు అనుకున్నా రెండు ఎపిసోడ్స్ ని బేరీజు వేసుకొని చూసినా ఎక్కడో ఆడియెన్స్ ఒకింత వెగటుగా, ఎబ్బెట్టుగా ఎందుకిలా చేశారు? అనే భావన కలిగే అవకాశం ఉంది.

ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం తనికెళ్ళ భరణి, శరణ్య శర్మలు తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నారు అనేది సమాధానం లేని ప్రశ్నగా అనిపిస్తుంది. ఇక ఇంకో బ్లండర్ ఏంటంటే ఈ లఘు చిత్రం సెటప్ 2004 లో చూపించారు. ఓకే ఇది బాగానే ఉంది కానీ ఆ టైం లో వీరు చూపించిన సెల్ ఫోన్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లా కనిపిస్తాయి.

అసలు 2004 సమయానికి అప్పుడప్పుడే కెమెరా ఫోన్స్ లాంటివి వస్తున్నా సమయం అది. కానీ ఇందులో మాత్రం ఇపుడు కాలంలో రికార్డు చేసినట్టు చేసేయడం ఫోటోలు తీసేయడం వీటికసలు లాజిక్ లేదు. వీటి మూలాన లాస్ట్ లో ఇచ్చిన సందేశానికి పెద్దగా విలువ లేకుండా పోయింది.

సాంకేతిక వర్గం:

నిర్మాణం పరంగా ఎపిసోడ్ ఓకే బాగానే ఉంది కానీ మేకర్స్ ఈ స్క్రిప్ట్ కి తగ్గ జాగ్రత్తలు మాత్రం తీసుకోలేదు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో చేసినపుడు మరింత తీసుకోవాలి వీటిని వదిలేసారు. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ కూడా నీట్ గా ఉంది. ఎడిటింగ్ ఓకే. ఇక దర్శకుడు గంగానమోని శేఖర్ విషయానికి వస్తే.. తన వర్క్ కొన్ని అంశాల్లో ఓకే కానీ కొన్ని అంశాల్లో మాత్రం డిజప్పాయింట్ గానే ఉంది. సరైన టెక్నీకల్ జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారు. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లు రాబట్టారు కానీ అసలు మెయిన్ లైన్ లో సెటప్ అంతా మిస్ ఫైర్ అయ్యింది. లాజిక్స్ పూర్తిగా వదిలేసారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ లఘు చిత్రం ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ ఎపిసోడ్ ఆకట్టుకోలేదు. కేవలం తనికెళ్ళ భరణి విషయంలో ఎపుడు నుంచో మిస్ అవుతున్న కామెడీ రోల్ లాంటిది ఉందని తప్పితే ఈ కథా సుధా ఫాలోవర్స్ ని మాత్రం బాగా డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే కథనంలో కూడా లోపాలు ఉన్నాయి. వీటితో ఈ ఎపిసోడ్ ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు