దళారీ వ్యవస్తను రూపుమాపడమే లక్ష్యం : తమ్మారెడ్డి


2012 -13 సంవత్సరానికి సంభందించిన ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండలి అధ్యక్ష పదవి కోసం నిన్న హైదరాబాద్లో ఎన్నికలు జరిగాయి. ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ్ మరియు స్రవంతి రవికిషోర్ మధ్య జరిగిన హొరా హొరీగా జరిగిన ఈ ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజ గెలుపొందారు. మొత్తం 12 పదవులకు ఎన్నికలు జరగగా తమ్మారెడ్డి భరద్వాజ వర్గం వారు 11 మంది గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ దళారీ వ్యవస్థను రూపుమాపి, చిత్ర పరిశ్రమకు వీలైనంత మంచి చేయడమే మా మొదటి లక్ష్యం. చిన్న చిత్రాల నిర్మాతలకు, పంపిణీ దారులకు మరియు థియేటర్ యాజమాన్యానికి వారి సమస్యలను పరిష్కరిస్తూ, వారి బాగు కోసం కృషి చేస్తానని’ ఆయన అన్నారు.

ఉపాధ్యక్షులుగా నాగినీడు, వీరి నాయుడు, మల్లేష్ యాదవ్ లను, కార్యదర్శకులుగా కె. అశోక్ కుమార్, ఆర్.వి భూపాల్ ప్రసాద్ లను, సహాయ కార్యదర్శకులుగా జీవితా రాజశేఖర్, ప్రసాద్, నాగేశ్వర రావు, మహేశ్వర్ రెడ్డి, వంశీ కిషోర్, లక్ష్మణరావు లను మరియు కోశాదికారిగా విజేందర్ రెడ్డి ను ఎంపిక చేశారు. ఇక భరద్వాజ బడా నిర్మాతల ఆధిపత్యానికి మంగళం పాడేస్తారని చిన్న చిత్రాల నిర్మాతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version