వైట్ మిల్క్ బ్యూటీ తమన్నాకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం + ప్రతిభ కలగలిసిన నటిగా నిరూపించుకున్న తమన్నా, రామ చరణ్ సరసన నటించిన ‘రచ్చ’ సినిమా రేపు విడుదల కాబోతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమన్నా ఈ సినిమాలో ఈ మాత్రం సంకోచం లేకుండా అందాల ఆరబోత చేసినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా వాన వాన వెల్లువాయే రీమిక్స్ పాటలో ఆమె కుర్రకారు మతి పోగొట్టనుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సంపత్ నంది డైరెక్షన్ వహించిన రచ్చ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపే విడుదల కానుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్ 6న విడుదల కానుంది.