ఆషికీ 2 రిమేక్ ను వదులుకున్న తమన్నా

ఆషికీ 2 రిమేక్ ను వదులుకున్న తమన్నా

Published on Mar 8, 2014 9:50 AM IST

tamannah-bollywood-movie
ఆషికీ 2 సినిమా రిమేక్ హక్కులను కొన్ని వారాల క్రితం సచిన్ జోషి సొంతం చేసుకుని తానే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాణ పర్యవేక్షణ చేయనున్నాడు. ఈ చిత్రంలో నాయికగా తమన్నాను అనుకున్నా ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించిందని సమాచారం.

హిందీలో శ్రద్ధాకపూర్ పోషించిన పాత్రని తెలుగులో ఒక ప్రముఖ నటి పోషిస్తుంది అని సచిన్ తెలిపాడు. ఈ పాత్రకు కాజల్, తమన్నా మరియు క్యాథరీన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు డేట్ లు సర్దుబాటు కాక తమన్నా ఈ ఆఫర్ ను వదులుకుందట. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

హమ్ షకల్స్ అనే హిందీ సినిమాకోసం మారీషస్ వెళ్ళిన తమన్నా ఇండియా తిరిగొచ్చింది. ఈ నెలలో మహేష్ సరసన ఆగడు షూటింగ్ లో పాల్గోనుంది.

తాజా వార్తలు