వివి వినాయక్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్?

Tamanna
వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరెకెక్కుతోంది. అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. తన కొడుకు మొదటి సినిమా కావడంతో బెల్లంకొండ సురేష్ సినిమాకి హెల్ప్ అయ్యే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బెల్లంకొండ తమన్నాని ఈ సినిమాలో భాగంగా చేసినట్లు సమాచారం.

ఈ సినిమా లాంచింగ్ సమయంలోనే సమంత, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ చివరికి సమంత ఒక్కటే హీరోయిన్ అయ్యింది. కానీ ఇప్పుడు తమన్నా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాటని ఏప్రిల్ చివరి వారంలో కానీ లేదా మే మొదటిలో షూట్ చేయనున్నారు.

ఇటీవలే దుబాయ్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.

Exit mobile version