రెండు విభిన్న పరిశ్రమలో ప్రముఖులు అయిన ఇద్దరు ఒకేసారి బుల్లి తెర మీద కమర్షియల్ కోసం కనిపించనున్నారు. అదేనండి తమన్నా మరియు క్రికెటర్ విరాట్ కోహ్లి కలిసి ఒక కమర్షియల్లో నటించనున్నారు. వీరు ఇద్దరు సెల్కాన్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి మీద ఒక కమర్షియల్ ని చిత్రీకరించాలని సంస్థ అనుకుంటుంది ఈ కమర్షియల్ చిత్రీకరణ అక్టోబర్ 14 నుండి ముంబైలో జరగనుంది. ఈ కమర్షియల్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం. వహించనున్నారు ఇదిలా ఉండగా తమన్నా ప్రస్తుతం తను నటించిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్ర విడుదల కోసం వేచి చూస్తుంది. హిందీలో “హిమ్మత్ వాలా” చిత్రీకరణలో పాల్గొంటుంది తరువాత “వెట్టై” రీమేక్లో నాగ చైతన్య సరసన నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా హిందీ లో రీమేక్ కానున్న “ఠాగుర్” చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన తమన్నా కనిపించనుంది.