‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!

Mana Shankara Varaprasad Garu

టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన సినీ కార్మికుల సమ్మె కారణంగా కొంతకాలం షూటింగులు ఆగిపోయాయి. దాంతో అనేక సినిమాలు ప్రభావితమయ్యాయి. వాటిలో చిరంజీవి హీరోగా వస్తున్న సంక్రాంతి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా ఒకటి.

సమ్మె వల్ల ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ రద్దవ్వడంతో సినిమా సంక్రాంతికి పూర్తవుతుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సాహు గారపాటి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “సమ్మె కారణంగా సుమారు 15 రోజుల షూటింగ్ దెబ్బతిన్నా, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా సహకరించారు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. నవంబర్ 15 నాటికి షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతికి తప్పకుండా రిలీజ్ చేస్తాం” అని ధైర్యంగా తెలిపారు.

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version