సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

pushpa3

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర రికార్డులను రప్పా రప్పా అంటూ ఎలా తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల మోతతో పాటు పలు అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకుంది.

తాజాగా సైమా అవార్డుల్లో ‘పుష్ప 2’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఇక సైమా వేదికపై దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 3’ చిత్రంపై కూడా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడు. ‘పుష్ప 3’ చిత్రం అసలు ఉంటుందో లేదో అనే సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఖచ్చితంగా ‘పుష్ప 3’ సినిమా ఉంటుందని సుకుమార్ తెలిపారు.

దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో తిరిగి రా రస్టిక్ పాత్రలో ఎప్పుడు కనిపిస్తాడా అని వారు అప్పుడే ఆశగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version