త్వరలో ‘ఆగడు’ సెట్ లో జాయిన్ కాబోతున్న తమన్నా

tamanna
తనుకు ఇటివలే పరిచయమైన సోషల్ మీడియా ని తమన్నా చాలా బాగా వాడుకుంటుంది . ఇటివలే ట్విట్టర్ లో జాయిన్ అయిన తమన్నా , ఫేస్ బుక్ లో కూడా ఖాతా తెరిచింది. తన సమాధానలతో తన ఫాన్స్ ని ఆశ్చర్య పరచడమే కాకుండా, తన హాస్యం తో అందరిని ఆశ్చర్య చకితులిని చేసింది . లింగుస్వామి తీసిన పైయా (ఆవారా) తన కి ఎంతో ఇష్టమైన చిత్రమని, ఆ చిత్రం లో తను పోషించిన పాత్ర తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. తన కెరీర్ లో మహేష్ బాబు తో మొదటి సారిగా ‘ఆగడు’ చిత్రం లో జత కట్టనుంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ చివరి హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం లో తమన్నా ఇంకా చేరవలసి వుంది. ఈ చిత్ర షూటింగ్ లో డిసెంబర్ చివరి వారం నుంచి పాల్గొనున్నానని తమన్నా తెలిపింది. ఈ చిత్రం లో తమన్నా పూర్తి మాస్ పాత్ర లో కనిపించనుంది .

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ‘ఆగడు ‘ చిత్రానికి కె.వి. గుహన్ ఛాయాగ్రహణం అందించనున్నారు . ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి లో విడుదల కానుంది .

Exit mobile version