మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవలే వచ్చిన ‘హిమ్మత్ వాలా’ సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని అందుకున్నా తెలుగు, తమిళ సినిమాలలో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. తమన్నా త్వరలోనే నాగ చైతన్య సరసన ‘వేట్టై’ సినిమాకి రీమేక్ గా న తెరకెక్కుతున్న ‘తడాఖా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమిళంలో అజిత్ సరసన చేయనున్న తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం కె.వి ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాకోసం తమ్మన్నాతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆర్య హీరో.
గత కొద్ది రోజులుగా ఇవి పుకార్లని కొట్టి పారేస్తున్నా ఆర్య, కెవి ఆనంద్ మాత్రం తమన్నాని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమన్నా కెవి ఆనంద్ సూర్య హీరోగా తీసిన ‘అయన్(వీడొక్కడే)’ సినిమాలో నటించింది, అది తమిళ్ లో సూపర్ హిట్. ఈ సినిమాకి తమన్నా ఒకే చెబుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవి కాకుండా వి.వి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కే ఓ తెలుగు సినిమాకి, అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కే ఓ హిందీ సినిమాకి సైన్ చేసింది.