మరో స్పెషల్ సాంగ్ లో తమన్నా ?

మరో స్పెషల్ సాంగ్ లో తమన్నా ?

Published on Nov 10, 2025 8:02 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు. ఈ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఈ సాంగ్ ను పెట్టాడట.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు