హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా కంగనా రనౌత్ తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ.. కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చింది. ఓ నెటిజన్ కంగనా రనౌత్ ను ప్రశ్నిస్తూ.. ‘మీకు రాజకీయాలు ఇష్టమా ? లేక, సినిమాలు ఇష్టమా ?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు కంగనా రనౌత్ సమాధానమిస్తూ.. ‘మనకు ఒకటే నచ్చాలని లేదు కదా. కాలం మారేకొద్దీ ఇష్టాలు మారతాయి. ప్రతి కొత్త విషయం మనకు ఓ పాఠం నేర్పుతుంది. నాకు రెండు ఇష్టమే’ అని కంగనా తెలిపింది.
మరో నెటిజన్ ప్రస్తుతం మీరు ఓన్ చేస్తున్న మీ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి ? అని అడగగా.. కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘ఓ కథ పై వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని కంగనా క్లారిటీ ఇచ్చింది. పెళ్లి పై మీ అభిప్రాయం ఏమిటి ? అని అడగగా.. ‘నా పెళ్లి పై ఇప్పటికే ఎన్నో వార్తలు రాశారు. వాటిల్లో ఒక్కటి కూడా నిజం లేదు. పెళ్లి, పిల్లలు అనేవి నాకు సూట్ కావు’ అంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.


