హీరో పై అతని భార్య సీరియస్ కామెంట్స్ !

హీరో పై అతని భార్య సీరియస్ కామెంట్స్ !

Published on Nov 10, 2025 11:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా భార్య సునీత అహూజా తన భర్త పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇటీవ‌ల ఈ జంట మ‌ధ్య దూరం పెరిగింది. కోర్టులో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఈ జ‌న్మ‌కు గోవిందా నుంచి సునీత విడిపోరు! అని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత సునీత అహూజా పాడ్ కాస్ట్ ల‌లో మాట్లాడుతూ త‌న భ‌ర్త గోవిందా త‌ప్పు ఒప్పుల‌ను ప్ర‌శ్నిస్తూ కామెంట్స్ చేసింది. దాంతో, ఈ జంట విడిపోతుందని అర్ధం అయింది.

ఇదే క్రమంలో తాజాగా సునీత అహూజా.. గోవిందా గురించి మాట్లాడుతూ.. ‘చిన్న‌త‌నంలో త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం. నేను కూడా చాలా తప్పులు చేసాను.. గోవిందా కూడా చేసాడు. కానీ, ఒక వ‌య‌సు వ‌చ్చాక కూడా త‌ప్పులు చేస్తే ఎలా ?, మీకు భార్య‌, పిల్ల‌లు ఉన్న‌ప్పుడు ఎందుకు అలాంటి త‌ప్పులు చేస్తారు ?. నిజం చెబుతున్నాను. గోవిందా త‌న జీవితంలో భార్య‌తో కంటే త‌న హీరోయిన్ల‌తోనే ఎక్కువ‌గా గ‌డిపాడు. మొదట్లో నాకు ఏదీ అర్థం కాలేదు. అన్ని తెలిసే సరికి జీవితం చాలా ముందుకు వచ్చింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు