ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న రవితేజ నెక్స్ట్!

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న రవితేజ నెక్స్ట్!

Published on Nov 10, 2025 7:01 AM IST

RT76
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మాస్ జాతర”. కొత్త దర్శకుడు భానుతో చేసిన ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమలతో తాను నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా తాలూకా టైటిల్ గ్లింప్స్ నేడు విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ ఓటిటి ఇంకా శాటిలైట్ పార్ట్నర్స్ లాక్ అయ్యిపోయారు.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కూడా జీ తెలుగు సంస్థే సొంతం చేసుకుంది. సో థియేటర్స్ లో రిలీజ్ తర్వాత ఈ సినిమా వీటిలో వస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోనే మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ చేసేస్తున్నారు.

తాజా వార్తలు