అటు నటన పరంగా, గ్లామరస్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులయ్యింది. తెలుగు కనిపించకపోయినా ఈ సంవత్సరం మొదట్లో తమిళ్ లో వచ్చిన వీరం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ‘ఆగడు’, రాజమౌళి ‘బాహుబలి’ సినిమాల్లో నటిస్తోంది.
ఇటీవలే ట్విట్టర్ లో తమన్నాని మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఆసక్తి ఉందని తన అభిమానులు అడిగితే ‘ నాకు నెగటివ్ షేడ్స్ ఉన్న ప్రతినాయిక పాత్రలు పోషించాలని ఉంది. అదే నాకు బాగా నచ్చే పాత్ర’ అని ఆమె సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకూ గ్లామర్ కి, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్న తమన్నా కోరిక ముందు ముందు తీరాలని ఆశిద్దాం.