పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేసిన ఎపిక్ వండర్ చిత్రం బాహుబలి సినిమాలు కోసం అందరికీ తెలిసిందే. ఇవి సృష్టించిన చరిత్ర మళ్ళీ గుర్తు చేసే విధంగా కొత్త లెక్కలు సృష్టించేందుకు మళ్ళీ థియేటర్స్ లోకి రెండు సినిమాలూ కలిపి “బాహుబలి ది ఎపిక్” గా రాబోతుంది.
అయితే ఈ అవైటెడ్ భారీ రీరిలీజ్ పట్ల నెలకొన్న ఆసక్తికి మరింత ఎగ్జైట్మెంట్ తో తోడయ్యేలా మరిన్ని క్రేజీ రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. దీనితో బాహుబలి రీరిలీజ్ థియేటర్స్ లో కొత్త సీన్స్ ని యాడ్ చేసి విడుదల చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఆ మధ్య యూట్యూబ్ లో కొన్ని డిలీట్ చేసిన సీన్స్ ని విడుదల చేస్తే అనూహ్య రెస్పాన్స్ వచ్చింది.
మరి అలాంటివే కాకుండా మరిన్ని క్రేజీ సన్నివేశాలు కూడా ఉండే అవకాశం కూడా ఉందట. ఇక రన్ టైం పరంగా చూసినా కూడా దాదాపు కుదించే ప్రయత్నమే చేస్తున్నారట. సో థియేటర్స్ లో మాత్రం బాహుబలి ది ఎపిక్ మరింత కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు.