పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న లాంగ్ అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. దాదాపు ఐదేళ్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లో రిలీజ్ కి వస్తుంది. అయితే మెయిన్ గా పవన్ కి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద మార్కెట్ ఉంది కానీ ఏపీ వరకు ఓకే కానీ నైజాం మార్కెట్ లో మాత్రం ఓపెనింగ్స్ పరంగా కొన్ని సవాళ్లు ముందున్నాయి. తెలంగాణాలో ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ తీసేసిన సంగతి తెలిసిందే.
కానీ హరిహర వీరమల్లు చారిత్రాత్మక చిత్రమే కావడంతో ఈ భారీ సినిమాకి తెలంగాణాలో స్పెషల్ పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఏపీలో ఉన్న విధంగా ఎర్లీ షోస్ నైజాం మార్కెట్ లో లేవు అనే మాట స్టార్ హీరోస్ అభిమానులకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అయితే హరిహర వీరమల్లు కి మాత్రం ఏపీలోనే కాకుండా నైజాం మార్కెట్ లో కూడా తెల్లవారు జాము 4 గంటల ఆట తోనే మొదలయ్యే సూచనలు ఇపుడు ఉన్నాయని లేటెస్ట్ టాక్. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ మాత్రమే ఇంకా రావాల్సి ఉంది.