బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించింది. అయితే భారీ హిట్ అందుకున్నాక కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ దివ్యాంశ బాగా చేసింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఈమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పటికే మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమాలను కూడా ఆల్ మోస్ట్ పూర్తి చేసుకుంటే… దివ్యాంశకు చెప్పుకోతగ్గ ఒక్క సినిమా కూడా లేదు.
ఇప్పటికీ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరికీ దివ్యాంశ కౌశిక్ సరిగ్గా సూట్ అవుతుంది. పైగా మంచి నటి కూడా.. అద్భుతంగా నటించగలిగిన హావభావాలు ఉన్న హీరోయిన్ కి ఛాన్స్ లు రావాలి. ఒకపక్క సరైన హిట్ అండ్ యాక్టింగ్ లేని హీరోయిన్స్ కూడా మంచి ఆఫర్స్ తో ముందుకు పోతుంటే.. చైతు లాంటి హీరో పక్కన మెయిన్ లీడ్ గా చేసిన దివ్యంశ కౌశిక్ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.