హార్డ్ వర్క్ మరియు నిబద్దత విజయాన్ని దరికి చేరుస్తుంది అన్న విషయాన్నీ శృతి హాసన్ నిరూపించింది. కాని ప్రతిభ మరియు హార్డ్ వర్క్ మాత్రమే విజయాన్ని తెచ్చిపెట్టదు అని ఈ భామ అంటున్నారు. ” ఒక నటుడికి నటన వస్తే సరిపోతుంది అనుకోడం చాలా తప్పు కెమెరా వెనక జరిగే అంశాల మీద కూడా అవగాహన ఉండాలి” అని అన్నారు.
” నేను కెమెరా వెనక జరిగే విషయాలను నటన రంగంలోకి రాకముందు నుండే గమనించే దానిని. అవసరమయిన లేకపోయినా సినిమా గురించి పూర్తి అవగాహన ఉండాలి నటుడికి అప్పుడే అతని/ఆమె నటనలో పరిపక్వత కనిపిస్తుంది. ఫేమస్ అయ్యేలా చేస్తుంది స్టార్ డం తెచ్చి పెడుతుంది” అని జత చేశారు. త్వరలో ఈ భామ రామ్ చరణ్ సరసన “ఎవడు”, రవితేజ “బలుపు” మరియు ప్రభుదేవా హిందీ చిత్రంలో కనిపించనున్నారు.