ఫుల్ హ్యాపీగా ఉన్న తడాఖా టీం

ఫుల్ హ్యాపీగా ఉన్న తడాఖా టీం

Published on May 11, 2013 11:30 PM IST

Tadakha

యువసామ్రాట్ నాగ చైతన్య – సునీల్ హీరోలుగా నటించిన ‘తడాఖా’ సినిమా శుక్రవారం విడుదలై, బాక్స్ ఆఫీసు వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మాస్ ఎంటర్టైనర్ గా సినిమాకి మంచి పేరు వస్తుండడంతో ‘తడాఖా’ టీం చాలా సంతోషంగా ఉన్నారు. బెల్లంకొండ సినిమా రిలీజ్ కి ముందు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇప్పుడు చూస్తుంటే ఆ కాన్ఫిడెంట్ నిజం అయినట్టు అనిపిస్తోంది.

డైరెక్టర్ డాలీకి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం, అలాగే త్వరలో నాగార్జున ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. నాగ చైతన్య – సునీల్ లను సినిమాలో బాగా హ్యాండిల్ చేసినందుకు అందరినుండి ప్రశంశలు అందుకుంటున్నాడు. తమన్నా, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు. ‘తడాఖా’ సినిమా తమిళ్ లో హిట్ అయిన ‘వేట్టై’ సినిమాకి రీమేక్.

తాజా వార్తలు