జుంబా చేస్తున్న తాప్సీ

జుంబా చేస్తున్న తాప్సీ

Published on Oct 8, 2013 11:30 PM IST

Taapsee
సౌత్ లో తమిళ మరియు తెలుగు భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న భామలలో తాప్సీ పన్ను ఒకరు. ‘ముని 3’ లో లారెన్స్ కు గాయం అవ్వడంతో పనినుండి కాస్త విరామం దొరికింది.

తాప్సీ ఇప్పుడు తన ఫిజిక్ ను కాపాడుకోవడానికి జుంబా డాన్స్ చేస్తుంది. శరీరాకృతిని కాపాడుకోవడానికి ఇది ఒక కొత్తరకం వ్యాయామం. దీనిద్వారా కష్టతారమైన వ్యాయామాలజోలికి పోకుండా

సులభంగా కొవ్వును తగ్గించవచ్చు . జీరో సైజ్ కోసం ఇవన్నీ తాప్సీ పడుతున్న పాట్లని పుకార్లు కూడా వచ్చాయి. ఐతే తనకు డాన్స్ ఇష్టమని అందుకే జుంబా చేస్తున్నానని తెలిపింది

తాను ఎప్పుడూ డైటింగ్ చెయ్యనని, ఎక్కువ నీళ్ళు, పండ్ల రసాలు తాగుతానని అవే తన అందానికి కారణమని తెలిపింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు