ట్రైలర్ రాకుండానే ‘ఓజి’ విధ్వంసం!

ట్రైలర్ రాకుండానే ‘ఓజి’ విధ్వంసం!

Published on Sep 19, 2025 9:00 AM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం ట్రైలర్ కూడా ఇంకా రాకుండానే మరిన్ని అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళుతున్నాయి. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సంచలన వసూళ్లతో అదరగొడుతుంది.

ఇంకా ఎలాంటి ట్రైలర్ రాకుండానే అప్పుడే అక్కడ 1.75 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని ప్రీ సేల్స్ రూపంలో అందుకొని దుమ్ము లేపింది. దీనితో ట్రైలర్ వచ్చే లోపు ఇదే మూమెంటం కొనసాగితే మాత్రం ట్రైలర్ వచ్చే లోపే 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని సినిమా అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు