“షాడో” చిత్రీకరణ లో పాల్గొంటున్న తాప్సీ


తాప్సీ తన రాబోతున్న చిత్రం “షాడో’ చిత్రీకరణ లో పాల్గొంటుంది. ఈ చిత్రం లో వెంకటేష్ సరసన కనిపించబోతున్న ఈ భామ వెంకటేష్ తో కలిసి పని చెయ్యటం ఇదే తొలిసారి.మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ మరియు మధురిమ బెనర్జీ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు మరొక స్టైలిష్ దర్శకుడితో పని చేస్తున్నా మహిళా దెఇనొత్సవమ్ రోజు ఈ చిత్ర బృందం తో కలవటం చాలా ఆనందంగా ఉంది అని తాప్సీ ట్విట్టర్ పేర్కొన్నారు.ఈ సంవత్సరం తాప్సీ కి మూచు చిత్రాలు విడుదల కాబోతున్నాయి “దరువు”,”షాడో” మరియు “గుండెల్లో గోదారి” తాజా సమాచారం ప్రకారం ఈ భామ ఒక ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకుంది ఒక తమిళ దర్శకుడు ఈ చిత్రాని తెరకెక్కించబోతున్నారు.

Exit mobile version