ఖుషీ ఖుషీగా ఉన్న తాప్సీ

ఖుషీ ఖుషీగా ఉన్న తాప్సీ

Published on Jul 14, 2013 12:15 PM IST

Taapsee
ఈ శుక్రవారం విడుదలైన ‘సాహసం’ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఫుల్ ఖుషీగా ఉంది. చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గోపీచంద్ – తాప్సీ హీరో హీరోయిన్ గా నటించారు. ఓ నిధి కోసం పాకిస్థాన్ వెళ్లి అడ్వెంచర్స్ చేసే ఈ సినిమాలో తాప్సీ మరో రెండు మూడు సంవత్సరాల్లో ప్రపంచం అంతమైపోతుందని ఈ లోపు ఇండియాలో ఉన్న అన్ని హిందూ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే కోరిక ఉన్న భక్తురాలిగా కనిపించింది. ప్రేక్షకుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తాప్సీ ‘ తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రెగ్యులర్ ఫార్మాట్ లో కమర్షియల్ మూవీ ఇవ్వకపోయినా వారు సినిమాని ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయని’ చెప్పింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు