తెలుగు నటి అయిన స్వాతి పక్క రాష్ట్రాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది. తమిళ్ లో తను కెరీర్ ప్రారంభించిన సుబ్రమనిపురం ద్వారా పరిచయమైన స్వాతి ఆ తర్వాత మలయాళంలో గ్రాండ్ గా తన తొలి సినిమాతో పరిచయమైంది. అలాగే విమర్శకులు మెచ్చిన మరో రెండు మళయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం స్వాతికి ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం స్వాతి మరో మలయాళ సినిమాకి సైన్ చేసింది. ‘మోసయిలే కుతిర మీనుకల్’ అనే ఈ సినిమాని థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కనుంది. ఈ సినిమాని ఎక్కువ భాగం లక్ష్యదీప్ లో షూట్ చేయనున్నారు. ఆసిఫ్ అలీ, సున్నీ వినే హీరోలుగా కనిపించనున్న ఈ మూవీలో స్వాతి తో పాటు జనని అయ్యర్ కూడా హీరోయిన్ గా కనిపించనుంది. ముందుగా ఈ పాత్ర కోసం ఆండ్రియా జేరేమియాని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ సర్దు బాటు కాకపోవడం వల్ల స్వాతి ఫైనలైజ్ అయ్యింది. స్వాతి త్వరలోనే రాజ్ పిప్పల్ల తీసిన ‘బంగారు కోడిపెట్ట’, నిఖిల్ తో పాటు చేసిన ‘కార్తికేయ’ సినిమాలలో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.