మహేష్ బాబు ,వెంకటేష్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” దాదాపుగా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మా వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో నవంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తిరుపతిలో విడుదల చెయ్యడానికి భారీ వేడుక కార్యక్రమం ఒకటి జరుపనున్నారు. అన్నదమ్ముల మధ్య జరిగే సంఘటనల చుట్టూ తిరిగే ఈ కథకు కావలసిన ఫీల్ ఉన్న సంగీతాన్ని అందించడంలో మిక్కి జే మేయర్ అద్భుతమయిన ప్రతిభ కనబరిచారని సమాచారం. సమంత, మహేష్ బాబు సరసన కనిపిస్తుండగా వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే వి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం మల్టీ స్టారర్ కావడం మూలాన ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలో మైలురాయిలా నిలిచిపోనుంది అని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
నవంబర్ లో విడుదల కానున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో
నవంబర్ లో విడుదల కానున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో
Published on Sep 8, 2012 9:25 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- శేఖర్ కమ్ముల నెక్స్ట్.. ‘కుబేర’ కాంబినేషన్ మళ్ళీ!
- వైరల్ వీడియో : రొమారియో షెఫర్డ్ అద్భుతం – ఒకే బంతికి 22 పరుగులు!
- రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. బ్లాస్ట్‌ను రెడీ చేస్తున్న ‘పెద్ది’
- ‘మిరాయ్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘చదువూ లేదు’ లిరికల్ రిలీజ్ చేసిన మేకర్స్!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!