మహేష్ బాబు ,వెంకటేష్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” దాదాపుగా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మా వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో నవంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తిరుపతిలో విడుదల చెయ్యడానికి భారీ వేడుక కార్యక్రమం ఒకటి జరుపనున్నారు. అన్నదమ్ముల మధ్య జరిగే సంఘటనల చుట్టూ తిరిగే ఈ కథకు కావలసిన ఫీల్ ఉన్న సంగీతాన్ని అందించడంలో మిక్కి జే మేయర్ అద్భుతమయిన ప్రతిభ కనబరిచారని సమాచారం. సమంత, మహేష్ బాబు సరసన కనిపిస్తుండగా వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే వి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం మల్టీ స్టారర్ కావడం మూలాన ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలో మైలురాయిలా నిలిచిపోనుంది అని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
నవంబర్ లో విడుదల కానున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో
నవంబర్ లో విడుదల కానున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో
Published on Sep 8, 2012 9:25 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!