తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీ స్టారర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద తుఫాను కలెక్షన్స్ రాబట్టుతోంది. ఈ చిత్రం ఇప్పటికే అక్కడ ఒక మిలియన్ డాలర్లను వసూళ్లు సాదించింది. ప్రస్తుతం రెండు మిలియన్ డాలర్ల రికార్డుని బద్దలు కొట్టడానికి సిద్దమయ్యింది. తెలుగు చిత్రం ఈ ఘనత సాదించడం ఇదే మొదటిసారి. చూస్తుంటే తెలుగు పరిశ్రమకి ఓవర్సీస్ లో అద్భుతమయిన ఆరంభం లభించినట్టు కనిపిస్తుంది. యు ఎస్ మాత్రమే కాకుండా ఓవర్సీస్ మొత్తం ఈ చిత్రం తన సత్తా చాటుతోంది.
వెంకటేష్ మరియు మహేష్ బాబు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి దానికి తగ్గట్టే చిత్రం కూడా బాగుండటంతో ఫ్యామిలి ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మించారు. సమంత మరియు అంజలి కథానాయికలుగా నటించారు. మిక్కి జె మేయర్ సంగీతం అందించగా మణిశర్మ రీ రికార్డింగ్ అందించారు.