తమిళ్ సినిమాలకంటే బాగా ఆడుతుంది : దిల్ రాజు

తమిళ్ సినిమాలకంటే బాగా ఆడుతుంది : దిల్ రాజు

Published on Jan 15, 2013 11:59 AM IST

Dil-Raju

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తయింది. కలెక్షన్స్ అదరగొడుతున్న ఈ సినిమా వివరాలు తెలియజేయడానికి చిత్ర నిర్మాత దిల్ రాజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ “అమెరికాలో మొదటి మూడురోజుల్లోనే అల్ టైం రికార్డ్ కొట్టింది. తెలుగు సినిమా పాత రికార్డులన్నీ తిరగరాసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. అలాగే ఆంధ్ర ప్రదేశ్లో అల్ టైం రికార్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా నా కెరీర్ లోనే హైయెస్ట్ గా టికెట్స్ కోసం ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. తమిళ నాడులో నిన్న ఒక తమిళ పత్రిక మా సినిమా గురించి రాసారు. సంక్రాంతికి విడుదలైన తమిళ సినిమాల కంటే ఈ సినిమా బాగా ఆడుతుంది అని రాసారు. ఒక తెలుగు సినిమా గురించి తమిళ్ వాళ్లు కూడా అభినందంచడం ఆనందంగా ఉంది.

మా సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంటే పైరసీ భూతం మమ్మల్ని వెంటాడుతుంది. ఈ సినిమా పైరసీ వచ్చింది, రాబోతుంది అని కొన్ని వెబ్ సైట్స్ ద్వారా తెలిసింది. ఈ సినిమా కోసం ప్రతి జిల్లాలో ఒక టీం పెట్టడం జరిగింది. వెంకటేష్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు కలిసి ఈ సినిమా పైరసీ ఎక్కడ కనపడినా మా టీంకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మిగతా హీరోల ఫాన్స్ కూడా ఇది వేరే హీరో సినిమా అని కాకుండా రేపు మీ సినిమాకి కూడా జరుగుతుంది కాబట్టి అందరూ తలచుకుంటే పైరసీని సగానికి పైగా అడ్డుకోవచ్చు” అన్నారు.

తాజా వార్తలు