విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఈ వేడుకకి అభిమానులు భారీగా తరలి రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు ఈ సినిమాకి హాజరవుతున్నారు. సమంత – అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ ఆడియో వేడుక లైవ్ అప్డేట్స్ మరియు ఈ వేడుక కవరేజ్ ప్రత్యేకంగా 123తెలుగు.కామ్ సాయంత్రం 6 గంటల నుండి మీకందిస్తోంది, చూసి ఎంజాయ్ చేయండి.