ఈ రోజు సీతమ్మ వాకిట్లో … గుమ్మడి కాయ కొట్టేస్తారు

ఈ రోజు సీతమ్మ వాకిట్లో … గుమ్మడి కాయ కొట్టేస్తారు

Published on Dec 24, 2012 12:05 PM IST

SVSC

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజుతో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఈ రోజు రెండు యూనిట్ బృందాలతో ఈ చిత్ర షూటింగ్ చేస్తున్నారు. ఒక యూనిట్ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుండగా, మరొక బృందంతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ రోజు గుమ్మడికాయ కొట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుపుతున్నారు. మరోవైపు మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తుండగా ఎడిటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వెంకటేష్, అంజలి మీద పాట కూడా ఇటీవల కేరళలో షూటింగ్ జరిపారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు