సీతమ్మ వాకిట్లో.. ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ – మహేష్ బాబు

సీతమ్మ వాకిట్లో.. ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ – మహేష్ బాబు

Published on Dec 17, 2012 4:44 PM IST

mahesh-babu
తమ ఫాన్స్ కి అందుబాటులో ఉండాలని ఈ మధ్య హీరో హీరోయిన్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. వీరిలానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన అభిమానులకు ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలను తెలియజేయాలని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో చేరాడు. మొదట్లో బాగా యాక్టివ్ గా ఉన్న మహేష్ ఆ తర్వాత ఎప్పుడో ఓ సారి అలా వచ్చి ఫాన్స్ ని పలకరిస్తున్నాడు. అలాంటి మహేష్ ఈ రోజు తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

” ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా బెస్ట్ ఆల్బం ఇచ్చినందుకు మిక్కీ జె. మేయర్ కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో మా నటన, మ్యూజిక్, మిగిలిన విషయాలన్నీ ఒక్క శ్రీకాంత్ అడ్డాల వన్ మాన్ షో మాత్రమే. ఈ సినిమాలో నేను ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని’ మహేష్ ట్వీట్ చేసాడు. ఆఉదిఒ సూపర్ హిట్ అవడంతో మహేష్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు